Emotional harassment of female sarpanch in Janakipuram: మహిళా దినోత్సవం మరుసటి రోజునే లైంగిక వేధింపులకు గురైనట్లు.. అధికార పార్టీ ప్రజాప్రతినిధిపై ఓ మహిళా సర్పంచ్ ఆరోపణలు చేసింది. ఆ నేత తనను లైంగికంగా వేధిస్తున్నాడని.. దీంతో తాను మానసిక క్షోభకు గురవుతున్నట్లు సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకిపురం గ్రామ సర్పంచి కురసపల్లి నవ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్‌కు చెందిన ప్రముఖ నేతల్లో.. ఓ ఎమ్మెల్యే తన కోరిక తీర్చమంటూ రోజూ మానసికంగా వేధించేవాడని నవ్య ఆరోపించారు. ఆ నాయకుడు చెప్పిన దానికి ఒప్పుకోకపోవడంతో గ్రామాభివృద్ధికి కేటాయించిన నిధుల్లో వివక్ష చూపిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వీటితో పాటు గ్రామంలో జరిగే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించట్లేదని చెప్పారు.
నేతల కోరికలు తీర్చేందుకు రాజకీయాల్లోకి రాలేదని నవ్య చెప్పారు. వేలేరు మండలాల్లో అగ్రవర్ణాల నాయకులదే అధికారం అని ఆరోపించారు. నియోజకవర్గంలో రెండు మూడు వర్గాలు ఉండటం వలన అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. గత నెలలో మంత్రి కేటీఆర్ పర్యటించినప్పుడు ఓ మహిళా ప్రజా ప్రతినిధి తనను తీవ్రంగా అవమానించారన్నారు. ఇప్పటికైనా వేధిస్తున్న నేత మహిళలతో మంచిగా వ్యవహరించాలని హితవు పలికారు.
"బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది మంచి నాయకులు ఉన్నారు. కానీ కొంత మంది నాయకులు మంచిగా ప్రవర్తించడం లేదు. మహిళలపై అసభ్యంగా వ్యవహరిస్తున్నారు. నన్ను వేధిస్తున్నారు. పంచాయతీకి, అభివృద్ధికి ఇవ్వాల్సిన బిల్లులు రాకపోతే కేసీఆర్ దగ్గరకి వెళతాను. మీకు అక్కా, చెల్లెళ్లు లేరా.. ఏమాత్రం సామాజిక బాధ్యత లేదు ఇలాంటి నాయకులకు. వేరే మహిళలను వేధించినప్పుడు గుర్తు పెట్టుకోండి మీ ఇంట్లో అక్కా, చెల్లెలు ఉన్నారని. నేను ఏమీ తప్పు చెయ్యలేదు. అందుకు ధైర్యంగా మాట్లాడుతున్నా. ఇకపైనైనా పాలన సరిగ్గా చెయ్యండి. ప్రజల మంచి నాయకులనే కోరుకుంటారు. మీలాంటి నాయకులను కాదు. గ్రామాభివృద్ధికి తోడ్పడండి. అందరినీ గౌరవించిన వారికే అన్ని హోదాలు ఉంటాయి. లేదంటే కిందికే వెళతారు." - కురసపల్లి నవ్య, జానకిపురం సర్పంచి
ఇవీ చదవండి:
- ఈ కష్టాలు భరించలేం.. దివ్యాంగురాలైన కుమార్తెతో కలిసి తండ్రి ఆత్మహత్య
- కుమార్తెల ముందే భార్యపై శానిటైజర్ పోసి నిప్పంటించిన భర్త.. సీసీ కెమెరాలో దృశ్యాలు
- బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజుల తర్వాత.. రూ.75 కోసం!
- ప్రేమించడమే పాపమైంది... యువకుడి పాలిట మృత్యు పాశమైంది..
- పిల్లల్ని ఎలా కనాలో నేర్పుతున్న పట్టణం.. ఎగబడి వెళ్తున్న జపాన్ జనం!
- పత్తి కొనుగోళ్లలో అదే ప్రతిష్టంభన.. కమీషన్ కోసం దళారుల నిరసన