అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఏఐఎల్యూ)రాష్ట్ర రెండో సదస్సును కర్ణాటక హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి హెచ్.ఎన్. నాగమోహన్ దాస్ హన్మకొండలో ప్రారంభించారు. రాజ్యాంగ విలువలను పెంపొందించి నవ భారత నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని అన్నారు. న్యాయవాదుల సంఘం రాజకీయ పార్టీ కాదని, స్వతంత్రంగా వ్యవహరించే సంఘమని పేర్కొన్నారు.
సామాజిక న్యాయం కోసం పని చేస్తూ లంచగొండితనం, మతోన్మాదాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగం కల్పించిన హక్కులపై దాడి జరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ ప్రొ. నాగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు నిరసన తెలిపే హక్కును సైతం ప్రభుత్వాలు కాలరాస్తున్నాయంటూ ఆరోపించారు.
ఇదీ చూడండి : 'శంషాబాద్' నిందితులకు 14 రోజుల రిమాండ్