ETV Bharat / state

రాఖీ పౌర్ణమి రోజున అక్కాచెల్లెళ్ల కోరికేంటో తెలుసా? - safety measures for brothers on rakshabandhan

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల పండుగ రాఖీ. సోదరి ఆప్యాయంగా రక్షాబంధన్‌ కట్టగానే సోదరులు ఆమెకు ప్రేమతో కానుకలు ఇస్తారు. కరోనా ప్రభావంతో ఈసారి రాఖీ పండుగ జరుపుకోలేని వారికి ఈ మాటలే రక్ష. మరి మీరు శ్రద్ధగా వినండి. ఆమె చెబుతున్న విషయాలు తప్పకుండా పాటించి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి నుంచి రక్షణ పొందండి!

safety measures for brothers on rakshabandhan
'మీ క్షేమమే ముఖ్యం'.. అన్నదమ్ములకు సోదరీమణుల హితవు
author img

By

Published : Aug 3, 2020, 2:46 PM IST

రక్షా బంధన్ అంటే సోదరి ఆప్యాయంగా రాఖీ కట్టాక సోదరులు ప్రేమతో కానుకలు ఇస్తారు. మిఠాయిలు తినిపించి అక్కా చెల్లెళ్లు తమ అనుబంధాన్ని అన్నదమ్ములతో పంచుకునే వేడుక.

కరోనా మహమ్మారి వల్ల కొందరు సోదరసోదరీమణులు కలుసుకోలేకపోవచ్ఛు దూరంగా ఉండడం వల్లో లేదా వైరస్‌ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు సోదరీమణులు రాఖీలు కట్టలేకపోవచ్చు సోదరులు వారికి మిఠాయిలు తినిపించలేకపోవచ్చు కాని సోదరి అంతకన్నా విలువైన కొన్ని విషయాలు చెబుతోంది. వాటిని తప్పకుండా పాటించి ప్రస్తుత ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి నుంచి రక్షణ పొందండి!

మాస్కు మరవొద్దు

అన్నయ్యా.. ఈ సారి రాఖీ పండక్కి నీచేతికి రాఖీతో పాటు మూతికి మాస్కు కూడా కనిపించాలి. అది లేకుండా గడప బయట అడుగు పెట్టొద్దు. నాకేం అవుతుందిలే అన్న నిర్లక్ష్య ధోరణి వద్దు. మాస్కే నీకు శ్రీరామరక్ష. రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో బయటికెళితే నిన్ను కాపాడేది అదేనని మరవద్దు.

కంటికి కనిపించని కరోనా వైరస్‌ ఎంతో ప్రమాదకరమైంది. ఎదుటివారిలో ఉన్నా మనం గుర్తించలేం.అందుకే మనలోకి రాకుండా అడ్డుకునేది మాస్కు అన్న విషయం మరవకు. ఈ చెల్లి కోసం తప్పకుండా మాస్కు కట్టుకుంటావుగా!

శుభ్రతే రక్ష

తాతయ్య మనకు చిన్నప్పుడు రాఖీ కథ చెప్పాడు గుర్తుంది కదా! అక్కాచెల్లెళ్లు కట్టే రాఖీ సోదరులను రక్షిస్తుందని. నీ చేతికి నేను కట్టే ఈ రాఖీ చూడగానే పరిశుభ్రతే రక్ష అన్నమాట గుర్తురావాలి. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కో.

పరిసరాల పరిశుభ్రత పాటించు, వ్యక్తిగత శుభ్రత ఎంతో అవసరం. ఓ యాభై రూపాయలు పెడితే శానిటైజర్‌ సీసా వస్తుంది. ఎప్పుడూ నీ జేబులోనే పెట్టుకో. ఏ వస్తువును తాకినా వెంటనే శానిటైజర్‌ను చేతులకు పూసుకో. శుభ్రత కరోనా నుంచి మనుషులను రక్షించే దివ్య ఔషధం.

భౌతిక దూరం పాటించు

తమ్ముడూ.. నాకు నా ఆరోగ్యం ఎంత ముఖ్యమో నీ ఆరోగ్యమూ అంతే ముఖ్యం. నేను సంతోషంగా ఉండాలంటే నువ్వూ ఆనందంగా ఉండాలి. ఇప్పటి వరకు టీవీల్లో, చరవాణుల్లో, సామాజిక మాధ్యమాల్లో మనుషుల మధ్య భౌతిక దూరం పాటించాలని చెబుతుండడం వింటూనే ఉన్నావు.

కొన్నిసార్లు మీ స్నేహితులతో కలిసి భౌతిక దూరం పాటించకుండా అనవసరంగా తిరగడం చూశా. అందుకే నేను చెబితేనైనా వింటావని చెబుతున్నా. ఎంత దగ్గరి స్నేహితుడైనా సరే వారికి దూరం పాటిస్తూ వారి మనసులకు దగ్గరవ్వు.

అవే కట్నకానుకలు

అన్నయ్యా! నేను నీకు ప్రతిసారీ రాఖీ కట్టేది నువ్వు పదికాలాలపాటు చల్లగా ఉండాలని.. నిండు నూరేళ్లు హాయిగా జీవించి నాకు ప్రేమను పంచాలనే.. ఇప్పుడు కరోనా పరిస్థితులను చూస్తుంటే నాకెంతో భయంగా ఉంది. అందుకే నేను చెప్పే జాగ్రత్తలు పాటిస్తావని, అదే నువ్వు నాకిచ్చే కానుకగా అనుకుంటా. ఈసారి కానుకలొద్దు, నువ్వు జాగ్రత్తలు పాటించి మహమ్మారి బారిన పడకుండా ఉంటే అదే పదివేలు.

బయటకెళ్లకు

నీకు ప్రయాణాలంటే ఎంతో ఇష్టమని నాకు తెలుసు. ఇది ప్రయాణాలు చేసే సమయం కాదు. ఇంటికే పరిమితమవ్వడం వల్ల ఆపద కాలం నుంచి గట్టెక్కొచ్చు. అయినా ఆనందం ఎక్కడో బయట లేదు. మన లోపలే ఉందన్న సంగతి గుర్తుంచుకో. నీ ఆరోగ్యం కోసం నిత్యం కాసేపు ధ్యానం చేయి.. క్రమం తప్పకుండా యోగా చెయ్యి.. ఆరోగ్యంపై దృష్టిపెట్టు. ఇంట్లోనే సురక్షితంగా ఉండు.

పౌష్టికాహారం తిను

కరోనా నుంచి రక్షణ పొందాలంటే మన రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని నిపుణులు పదేపదే చెబుతున్నారు నువ్వా ఎప్పుడూ చిరుతిళ్లు తింటూ ఉంటావు. హోటళ్లలో, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో విందారగిస్తుంటావ్‌. ఇప్పుడు అవి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇంటి ఆహారమే ఎంతో మంచిది. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తాజా పండ్లు, ఆకుకూరలు తీసుకో. పౌష్టికాహారం తిని పుష్టిగా ఉండు. గోరువెచ్చని నీళ్లు తాగి ఆరోగ్యంగా ఉండు.

కడిగాకే ...

ఇంట్లోకి సరకులు తెచ్చేందుకు నువ్వే వెళుతుంటావు. కానీ వైరస్‌ ఎక్కడ తిష్ట వేసుకొని ఉందో ఎవరూ చెప్పలేరు. అందుకే ఇంటికి తెచ్చిన ప్రతి వస్తువును శుభ్రంగా కడగండి. కూరగాయల నుంచి మొదలుపెడితే పండక్కి తెచ్చే కొత్త దుస్తులను కూడా శానిటైజ్‌ చేయండి. వాటిని కడిగాక చేతులు శుభ్రపరచుకోండి.

అవగాహన పెంచుకో

కరోనా అనగానే ప్రజలు అనేక రకాలుగా భయపడిపోతున్నారు. ఈ వ్యాధిపై సరైన అవగాహన పెంచుకోవాలి. కానీ పలు సామాజిక మాధ్యమాల్లో అనేక రకాల అవాస్తవ ప్రచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ నమ్మి ఆత్మస్థైర్యం కోల్పోవద్ధు కరోనా వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సరైన అవగాహన పెంచుకొని మానసికంగా దృఢంగా ఉండండి. మరి ఈ సోదరి కోసం నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే అదే నువ్వు రాఖీ పండక్కి ఇచ్చే విలువైన కానుక!

ఇదీ చూడండి : పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.