వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్లలో సాహో చిత్రం విడుదలైంది. థియేటర్ ప్రాంగణాలలో ప్రభాస్ అభిమానుల ఫ్లెక్సీలను, భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. తమ అభిమాన నాయకుడికి చిత్రాన్ని వీక్షించేందుకు ఉదయాన్నే బారులు తీరారు. ప్రత్యేక షో ఏర్పాటుచేయడంతో అభిమానులు మొదటిరోజు మొదటి షో చూసేందుకు టికెట్ల కోసం ఎగబడ్డారు. అభిమానుల కేరింతలతో సందడి నెలకొంది. తొక్కిసలాట జరగకుండా థియేటర్ల వద్ద పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: నేడు 'ఆయూష్ రాక్‌స్టార్' స్మారక స్టాంపుల విడుదల