వరంగల్ పట్టణ జిల్లా కాజీపేటలో 55 వేల రూపాయల విలువ చేసే 550 కిలోల పటికను ఆర్పీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బల్లార్షా నుంచి కాజీపేట రైల్వే జంక్షన్‌కు వస్తున్న అజ్ని ప్యాసింజర్ రైలులో పటిక రవాణా అవుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఈ పటికను గుడుంబా వంటి వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. పటికను తరలిస్తున్న వ్యక్తులు రైల్వే పోలీసులు వస్తున్న విషయాన్ని ముందుగానే గ్రహించి పరారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పటికను ఎక్సైజ్ అధికారులకు అప్పగించనున్నట్లు ఆర్పీఎఫ్ ఎస్ఐ వీరన్న తెలిపారు.
ఇవీ చూడండి: చనిపోయింది కడుపు నొప్పితో కాదు...