వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్‌ని ఆర్పీఎఫ్ ఐజీ ఈశ్వర్‌రావు తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాల్సిన పద్దతులపై సిబ్బందికి సూచనలు చేశారు. ప్రయాణికుల భద్రత, అవసరమైన సమయాలలో వారికి అందించవలసిన సహాయ, సహకారాల గురించి ఐజీ వివరించారు. అనంతరం విధి నిర్వహణలో ఆర్పీఎఫ్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశాన్ని నిర్వహించారు.
ఇదీ చూడండి :నిజామాబాద్లో రచ్చరచ్చ.. తెరాస, భాజపా పోటాపోటీ నినాదాలు