ETV Bharat / state

ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. రోడ్డుకు మోక్షం - హన్మకొండ కొత్త బస్టాండ్​ రోడ్డు పనులు పూర్తి

హన్మకొండ కొత్త బస్టాండ్ కూడలి రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. నగర పాలకసంస్థ ఆధ్వర్యంలో రూ.2కోట్ల నిధులతో కూడలికి నాలుగు వైపులా మురుగు, వరద నీరు పారేలా కల్వర్టులు నిర్మించి రోడ్లను వేశారు.

ఎట్టకేలకు ఆ రోడ్డుకు మోక్షం లభించింది
ఎట్టకేలకు ఆ రోడ్డుకు మోక్షం లభించింది
author img

By

Published : Sep 10, 2020, 4:59 PM IST

హన్మకొండ కొత్తబస్టాండ్​ కూడలి వద్ద పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కొన్నేళ్లుగా బస్టాండ్ రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రోడ్డు సమస్యలపై పలుమార్లు ఈటీవీ, ఈటీవీ భారత్​లో కథనాలు వచ్చాయి.

ప్రజల ఇబ్బందులు గమనించిన అధికారులు వరదనీరు దిగిపోయేలా కల్వర్టులు నిర్మించి, రోడ్డు మరమ్మతు పనులు చేశారు. రోడ్లు బాగుపడడం వల్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: భాగ్యనగరంలో వర్షం... ట్రాఫిక్​కు అంతరాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.