Revanthreddy meet Congress leader Thota Pawan: వరంగల్ యువజన కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై దాడి పార్టీ నేతలపైన జరిగిన దాడిగానే భావిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తమ మౌనాన్ని చేతకానితనంగా భావించొద్దని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిన్న జరిగిన దాడిలో గాయపడి, నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువజన కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌ను ఇవాళ రేవంత్ పరామర్శించారు.
Revanthreddy meet Thota Pawan: రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్‌ను ఆయన కుటుంబ సభ్యులను రేవంత్ ఓదార్చారు. ఈ మేరకు దాడికి పాల్పడ్డ వారి వివరాలను రేవంత్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. పవన్‌కు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆయన వైద్యులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పవన్‌కు భరోసా ఇచ్చారు.
అనంతరం ర్యాలీగా వెళ్లి దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ రేవంత్‌రెడ్డి నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. గంజాయి మత్తులో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అతని అనుచరులు ఆరాచకాలకు తెగబడుతున్నారని వారిపై హత్యానేరం మోపి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర విజయవంతంగా సాగుతుండడాన్ని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని రేవంత్ ఆరోపించారు.
పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించి దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది తమపైన దాడిగానే భావిస్తున్నామని చెప్పిన రేవంత్ దాడులతో రాజకీయాలు చేయాలనుకుంటే తామూ సిద్ధమని తెలిపారు. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని కోరుతూ కాంగ్రెస్ శ్రేణులు సీపీ కార్యాలయం ఎదుట కొంతసేపు అందోళనకు దిగారు.
ఇవీ చదవండి: