Retired MPDO Ramakrishna Murder In Janagama : మూడు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన విశ్రాంత ఎంపీడీవో రామకృష్ణయ్య హత్యకు గురయ్యారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన రామకృష్ణయ్య కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు ఆచూకీని తెలుసుకునే ప్రయత్నంలో.. చంపక్ హిల్స్‌లోని నీటికుంటలో విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు నిందితులు సుపారీ తీసుకొని హత్య చేశారని చేశారు. వారిలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. భూవివాదంతోనే విశ్రాంత ఎంపీడివోను హత్య చేసినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు.
Retired MPDO Ramakrishna Dead Body Found : తన తండ్రి కనిపించడం లేదని కుమారుడు అశోక్ 16 తేదీన బచ్చన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని సీపీ రంగనాథ్ తెలిపారు. దీనితో పోలీసులు సుమారు 30 మంది అనుమానితులను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టామన్నారు. రామకృష్ణయ్య ఆచూకీ కోసం ఐదు పోలీసులు బృందాలు జనగామ, బచ్చన్నపేట పరిసర ప్రాంతాల్లో గాలిస్తుండగా.. చంపక్ హిల్స్‌లో క్రషర్ వద్ద నీటికుంటలో మృతదేహం ఉన్నట్లు గుర్తించామని సీపీ చెప్పారు. వెంటనే ఆ మృతదేహం అతనిదని చెప్పలేకపోయామని.. ఆ తర్వాత అతనిదే అని నిర్ధారించుకున్నామన్నారు. మరోవైపు మృతుని కుమారుడు అశోక్ అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే తన తండ్రి హత్యకు గురయ్యారని ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.
"రామకృష్ణను నలుగురు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి జనగామలోని చంపక్ హిల్స్ ప్రాంతానికి తీసుకువెళ్లతారు. అక్కడ తువ్వాలుతో గొంతుకు నొక్కి చంపుతారు. ఆతర్వాత మృతదేహాన్ని అక్కడ ఉన్న నీటి కుంటలో పడేస్తారు. అంజయ్యకు ఫోన్ చేసిన చంపేసిన విషయం చెప్పారు. ఈ హత్యకు సుపారీ గ్యాంగ్ రూ.8 లక్షలను తీసుకుంది." -రంగనాథ్, వరంగల్ సీపీ
భూవివాదంతోనే హత్య : భూవివాదంతోనే విశ్రాంతి ఎంపీడీవోను హత్య చేశారని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. అంజయ్య అనే నిందితుడు అసైన్డ్ భూములను కొనుగోలు చేశాడని.. ఆ భూ లావాదేవీలపై రామకృష్ణ అధికారులకు ఫిర్యాదు చేశాడు. తరచూ ఈ భూముల కోసమే రెవెన్యూ అధికారులకు రామకృష్ణ ఫిర్యాదు చేసేవారు. లోకాయుక్త సమాచార హక్కు చట్టాలను ఉపయోగించి.. సమాచారాన్ని సేకరించేవారన్నారు. రామకృష్ణ ఫిర్యాదుతో అంజయ్య కొన్న భూములను అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారని వివరించారు. భూములపై ఫిర్యాదు చేసినందుకు.. ఐదుగురు సభ్యుల సుపారీ ముఠాతో హత్య చేయించాడని వెల్లడించారు. వారిలో ముగ్గురు నిందితులు అరెస్టు కాగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి :