ETV Bharat / state

భూ కబ్జాదారులపై నిఘా వర్గాల నివేదిక.. అనుచరుల్లో గుబులు - report on land grabbers in warangal to city cp by surveillance groups

తెలంగాణ ఏర్పాటయ్యాక వరంగల్ నగరంలో భూములకు గిరాకీ పెరిగింది. ఈ సమయంలో ప్రజలకు సేవకులుగా ఉండాల్సిన కొంత మంది నేతలు భూ వ్యవహారాల్లో తలదూర్చుతూ సమాజానికి మచ్చ తెస్తున్నారు. పోలీసుల తీరుపై నిఘా వర్గాలు ఆరా తీశాయి. ఎక్కడెక్కడ భూకబ్జాలకు పాల్పడిందీ.. వారి వెనుక ఎవరు ఉందీ.. వీరికి పోలీసు శాఖలో ఎవరు సహకరిస్తుందీ వివరంగా సీపీకి నివేదిక ఇవ్వడం చర్చనీయాంశమైంది.

report on land grabbers in warangal to city cp by surveillance groups
భూ కబ్జాదారులపై నిఘా వర్గాల నివేదిక.. నేతల అనుచరుల్లో గుబులు
author img

By

Published : Aug 3, 2020, 2:43 PM IST

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక వరంగల్‌ నగరంలో భూముల ధరలు బాగా పెరిగాయి. రింగ్‌ రోడ్డు నిర్మాణం కావడం, చుట్టుపక్కల గ్రామాలు నగరపాలక సంస్థల్లో విలీనం కావడంతో భూములకు మంచి గిరాకీ ఏర్పడింది. రానున్న రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చే అవకాశం ఉంది.

దీంతో భూముల కొనుగోలు ఎక్కువైంది. నగరంలో కొంత మంది నాయకుల అండదండలతో అనుచరులు ముఠాగా ఏర్పడి, దర్జాగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. పక్కా ప్రణాళికతో భూములను లాక్కుంటటున్నారు. కొంతమంది పోలీసు అధికారులు కూడా ప్రజాప్రతినిధులకు సహకరిస్తున్నారు. పోలీసుల తీరుపై నిఘా వర్గాలు ఆరా తీశాయి. ఎక్కడెక్కడ భూకబ్జాలకు పాల్పడిందీ.. వారి వెనుక ఎవరు ఉందీ.. వీరికి పోలీసు శాఖలో ఎవరు సహకరిస్తుందీ వివరంగా సీపీకి నివేదిక ఇవ్వడం చర్చనీయాంశమైంది.

ఏమీ చేయలేని పోలీసులు

పోలీసులు కూడా ఇది పూర్తిగా సివిల్‌ సమస్య కావడంతో తాత్కాలికంగా చర్యలు తీసుకున్నా.. తర్వాత వారిపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి పెరగడంతో చేతులెత్తేస్తున్నారు. బలమైన నాయకుడు ఎటువైపు ఉంటే వారికి మద్దతు పలుకుతున్నారు. చివరకు భూ ఆక్రమణదారులు బాధితులతో బేరసారాలు చేసుకొని తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేసి పెద్ద మొత్తానికి ఇతరులకు విక్రయిస్తున్నారు. ఇలా కొన్ని రోజుల నుంచి నగరంలో జరుగుతోంది. నగరంలో పోలీసులు సుమారు 40 మంది భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై రౌడీషీట్లు తెరిచారు.

ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు

  • హన్మకొండలో పోచమ్మ కుంట వద్ద నగరానికి చెందిన వ్యక్తికి 300 గజాల భూమి వంశపారంపర్యంగా వస్తుంది. ఓ ప్రజాప్రతినిధి కన్ను పడింది. ఇంకేముంది స్థానికంగా ఉన్న కొంతమందిని కలిసి భూమిపైకి పంపించాడు. అసలు యజమాని కోర్టుకు వెళ్లాడు. ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పు కూడా వచ్చింది. కానీ ప్రజాప్రతినిధి మాత్రం భూమిని వదలడం లేదు. కొద్ది రోజుల క్రితం నిర్మాణం చేపడితే దానిని కూల్చివేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. భూ యజమాని ఉన్నతాధికారులకు కలిసి ఫిర్యాదు చేసి ఆధారాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేదు.
  • వరంగల్‌లో ఓ మహిళా ప్రజాప్రతినిధి ఇంటి పక్కనే 100 గజాల భూమి ఉంది. సదరు ప్రజాప్రతినిధి రాజకీయంగా రాణించలేకపోతుండటంతో వాస్తు చూపించారు. ఆ భూమి తీసుకొనేందుకు భూయజమానిని ముప్పు తిప్పులు పెడుతోంది. పలుసార్లు బెదిరింపులకు పాల్పడింది. ఆ స్థలంలో వాహనాలను పార్కింగ్‌ చేస్తే పోలీసులకు చెప్పి అక్కడ నుంచి తొలగించింది.
  • కొన్ని సంవత్సరాల క్రితం మమూనూరు ప్రాంతంలో కాజీపేటకు చెందిన వ్యక్తి కొంత భూమిని కొనుగోలు చేశారు. తర్వాత ఓ ప్రజాప్రతినిధి దానిని అక్రమించుకునేందుకు ప్రయత్నించాడు. సదరు భూ యజమాని కోర్టుకు వెళ్లాడు. సదరు ప్రజాప్రతినిధిని ఇదేమి దౌర్జన్యం అని అడిగితే ఎన్నికల సమయంలో రూ. 50 లక్షలు ఖర్చు అయిందని, ఆవి ఇస్తే మీ భూమి జోలికి రామని చెప్పుకొచ్చారు. యజమాని మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పాడు.
  • నగరంలో భూకబ్జాలపై పోలీసులు దృష్టి సారించారు. ఇటీవల తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడం నగర పోలీసు కమిషనర్‌ గుర్తించారు. ఆయా స్టేషన్ల సిబ్బందికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడెక్కడ భూకబ్జాలు ఉన్నాయో పరిశీలించి రికార్డు తయారు చేయాలని సూచించారు. మరోవైపు నిఘా వర్గాలు కూడా కమిషనర్‌కు ప్రత్యేక నివేదిక ఇచ్చాయి. దీంతో భూకబ్జాదారులు ఇప్పుడు వణికిపోతున్నారు. కొంత కాలం పోలీసుల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

నకిలీ దస్త్రాల తయారీ

భూకబ్జాలకు ఎలా పాల్పడుతోందీ సవివరంగా అందులో వివరించారు. నగరంలో నకిలీ భూపత్రాలను సృష్టించే కొంత మంది ఉన్నారు. వీరు న్యాయపరమైన చిక్కులు రాకుండా పాత దస్తావేజులను తయారు చేసి పట్టాదారులు ఇతరులకు జీపీఏ చేసినట్లుగా కాగితాలను సృష్టిస్తారు. జీపీఏ చేసిన వ్యక్తుల నుంచి కొనుగోలు చేశామని చెబుతుంటారు. ఇలాంటి కేసుల్లో చిక్కుముడి వీడాలంటే తప్పకుండా భూములు సర్వే చేయించాల్సి ఉంటుంది. అందుకోసం నకిలీ భూపత్రాలను సృష్టించిన వ్యక్తులు తమకు తెలిసిన రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. తరువాత ఆ స్థలం వద్దకు వెళ్తారు. అసలు పట్టాదారు అమ్మి కొనుగోలు చేసిన వ్యక్తి అక్కడికి వస్తే మీ డాక్యుమెంట్లను చూపించండని చెబుతూ తమ వద్ద ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయని గందరగోళం సృష్టిస్తారు. దిక్కుతోచని పరిస్థితుల్లో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నా వారి నుంచి తగు రక్షణ లేకుంది.

ఇవీ చూడండి: రాఖీ స్పెషల్... వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.