ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్రంలోని అన్ని కార్యాలయాల్లో పాత పద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ పక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు పలు చోట్ల సందడి నెలకొనగా..వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేట కార్యాలయం వద్ద మాత్రం రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతున్నాయి.
పాత పద్ధతి ఈరోజే ప్రారంభం కావడం, నిన్న సెలవు కారణంగా పలుచోట్ల రిజిస్ట్రేషన్లు మందకోడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం వరకు కేవలం 4 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని ఖాజీపేట కార్యాలయ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:పాత పద్ధతిలో ప్రారంభమైన వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు