ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థిరాస్తి వ్యాపారులు ఆందోళన చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలతో పాటుగా వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ధరణి పోర్టల్ అసంపూర్ణంగా ఉందని వారు ఆరోపించారు. పూర్తి స్థాయిలో ధరణిని అభివృద్ధి చేసే వరకు పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని కోరారు.
కనీసం మరో 6 నెలల వరకైనా పాత పద్ధతిలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే తామంతా కుటుంబాలతో సహా రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాపారులు వాపోయారు. ఎల్ఆర్ఎస్, ధరణి పోర్టల్ పట్ల ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని... లేకుంటే తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సుమారు 500 మంది స్థిరాస్తి వ్యాపారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: స్లాట్ బుకింగ్ పేరుతో ప్రజలను గందరగోళం చేయొద్దు: హైకోర్టు