వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. కొవిడ్ వార్డులో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ఎలాగైతే పది శాతం బోనస్ ఇస్తున్నారో.. అదే తరహాలో పారిశుద్ధ్య కార్మికులకు బోనస్ ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విధులను బహిష్కరించి ఆసుపత్రి గేటు వద్ద ధర్నాకు దిగారు.
ఆసుపత్రి కార్యనిర్వహణాధికారి.. కార్మిక సంఘం నేతలతో చర్యలు జరపగా.. వారు ఆందోళన విరమింపజేశారు. కరోనా వార్డులో పనిచేసే వారికంటే తమకే ఎక్కువ ప్రభావం ఉంటుందని అధికారి దృష్టికి తీసుకెళ్లారు. కార్మికులకు పీపీఈ కిట్లతో పాటు బోనస్ చెల్లించాలని కోరారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో మరోసారి లాక్డౌన్..!