కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ధరలు రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పత్తి కొనుగోలు చేయకపోవడం వల్ల ప్రైవేట్ వ్యాపారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సాగర్ ఆరోపించారు.
మద్దతు ధర కరవు
పత్తి సీజన్ మొదలైనప్పటికీ సీసీఐ పత్తి కొనుగోలు చేయకపోవడం వల్ల మద్దతు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు క్వింటాకీ రూ.2,500 వరకు నష్టపోతున్నారని అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు.
ఇదీ చదవండి: ఎల్ఆర్ఎస్ వల్ల రాష్ట్ర ప్రజలపై అధిక భారం : భట్టి