వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వడ్డేపల్లి టీచర్ కాలనీలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదు చేపట్టాలన్న రాష్ట్ర సర్కార్ ఆదేశాల మేరకు.. నగరపాలక సంస్థ చర్యలు చేపట్టిందని తెలిపారు. ఆస్తుల సర్వేకు ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లకు యజమానులు సహకరించాలని కోరారు.
నగరంలో 2 లక్షల 12వేల గృహాల నమోదు ప్రక్రియను అక్టోబర్ 15లోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ హనుమంతి ఆదేశించారు. ఆస్తుల విషయంలో ఎలాంటి తగాదాలు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టిందని తెలిపారు. ఎన్యూమరేటర్లు ఇంటికి వస్తే ఇంట్లో ఎవరూ లేరనే సమాధానాలు ఇవ్వకూడదని.. సర్వేకు సహకరించాలని కోరారు.