నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారాను తప్ప రాజకీయ లబ్ధి కోసం కాదని మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. తాను భాజపా పార్టీలో చేరడానికి గల కారణాలను హన్మకొండలోని తన నివాసంలో ఆయన వివరించారు. తెదేపా రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసినప్పటికీ..అది ఒక ఆంధ్రా పార్టీ అని తెరాస చేసిన ప్రచారం ప్రజల మనస్సులో బలంగా పాతుకుపోయిందని అన్నారు. ఈ కారణంగానే తెదేపాను ప్రజలు ఆదరించే స్థితిలో లేరని పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బలమైన పార్టీగా ఎదిగేది భాజపా మాత్రమే అని, అందుకే దిల్లీలో జేపీ నడ్డా ఆధ్వర్యంలో భాజపాలో చేరినట్లు ఆయన వివరించారు.
ఇదీ చూడండి: 'చంద్రయాన స్వప్నం నెరవేరడం ఖాయం'