కొవిడ్ రోగులకు వైద్యసేవలందిస్తున్న కేఎంసీ, ఎంజీఎం ఆసుపత్రి జూనియర్ వైద్యులకు హైదరాబాద్కు చెందిన మహేశ్వర మెడికల్ కాలేజీ, ఆసుపత్రి యాజమాన్యం 600 పీపీఈ కిట్లు, 400 ఎన్-95 మాస్కులను అందజేసింది. బుధవారం కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య సమక్షంలో వీటిని కళాశాల యజమాన్యం అందజేసింది.
మహేశ్వర మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఛైర్మన్ టీజీఎస్ మహేశ్, డైరెక్టర్ డాక్టర్ వి.కృష్ణారావు, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సవితాసుఖదేవ్, వైద్యులు డాక్టర్ జోత్స్న, డాక్టర్ రూప, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ చక్రథర్, డాక్టర్ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఈటీవీ భారత్ స్పందన: '‘పీఎం కిసాన్’'లో తెలంగాణకు చోటు