వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వరంగల్ పోలీస్ కమిషనర్ ఐజీ ప్రమోద్ కుమార్ ఆవరణలో పూల, పండ్ల మొక్కలను నాటారు. మెుక్కల సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవడం వల్ల నాటిన మొక్కలతో పోలీస్ కమిషనర్ సెల్ఫీ తీసుకున్నారు.
స్వీకరించాలని కోరారు...
అనంతరం వరంగల్ పోలీస్ కమీషనర్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డీసీపీ పుష్పా, వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్మూడ్ రిజర్వ్ విభాగం అదనపు డీసీపీ భీం రావులను గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక హరితహారం కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్త్రృతంగా అమలు చేస్తుందన్నారు.
గ్రీన్ ఛాలెంజ్ ద్వారా...
ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా మెుక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు, ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలవారికి కాలుష్య రహిత వాతావరణాన్ని అందించగలమన్నారు.
ఇవీ చూడండి : అంచనాలకు మించి కరోనా కేసులు ఉన్నాయి: సీసీఎంబీ సర్వే