ETV Bharat / state

కేసుల ఛేదనలోనే కాదు.. ఆప్తమిత్రుడిగానూ.. - నేరస్థులను పట్టుకోవడంలో జాగిలాల పాత్ర

జాగిలాలు నమ్మిన బంట్లలా పనిచేస్తుంటాయి. వీటికిచ్చే శిక్షణ అనుసరించి జాగిలాల్లో ఒక్కోటి ఒక్కో ప్రత్యేకత కలిగి ఉన్నాయి. పేలుడు పదార్థాలను పసిగట్టేవి కొన్నయితే, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను గుర్తించేవి వేరే ఉంటాయి. నేరం జరిగిన చోట పరిసరాల్లో వాసన చూసి నిందితులు, అనుమానితులను గుర్తించేవి మరికొన్ని ఉన్నాయి.

కేసుల ఛేదనలోనే కాదు.. ఆప్తమిత్రుడిగానూ..

author img

By

Published : Aug 26, 2020, 1:41 PM IST

* వరంగల్​ జిల్లా పర్వతగిరి పోలీసుస్టేషన్‌ పరిధి ఏనుగల్లు వద్ద రోడ్డు పక్కనే మృతదేహాన్ని పడేసి వెళ్లారు. పోలీసుల జాగిలం నిందితుల ఆనవాళ్లను గుర్తించింది. పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

* గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో 9 మంది హత్య కేసులో పోలీసులు నిందితులను పట్టుకోవడంలో జాగిలం నిందితుడి అడుగు జాడలను కనిపెట్టింది. అది చూపిన ఆనవాళ్లతో పోలీసులు నిందితుడు సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

* గత ఏడాది కాజీపేట రైల్వే స్టేషన్‌లో జాగిలాలతో తనిఖీలు నిర్వహిస్తుంటే గంజాయి ప్యాకెట్‌ను గుర్తించి మొరగడంతో పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.

* పోలీసు జాగిలాలకు మనుషుల కన్నా 10వేల రెట్లు ఎక్కువ వాసన పసిగట్టే సామర్థ్యం ఉంటుంది. అంతేకాదు.. మంచి శిక్షణ పొందిన శునకం ఏడాదికి 600 నుంచి 1000 మనుషుల పని గంటలను ఆదా చేయగలదు. అందుకనే వీటిని పలు నేరాల్లో ఉపయోగించి కీలక ఆధారాలు సేకరిస్తుంటారు. ప్రముఖులు ఎవరు వచ్చినా, భారీ బహిరంగ సభ జరిగినా, ఇలా భద్రత అంశాల్లో పోలీసులు చేసే తనిఖీల్లో కచ్చితంగా డాగ్‌ స్వ్కాడ్‌ ఉండి తీరాల్సిందే.

* వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో దశాబ్దాల నుంచి శునకాలు నేర పరిశోధనకు సహకరిస్తున్నాయి. జర్మన్‌ షెఫ్పర్డ్‌, డాబర్‌మెన్‌, లాబ్రడార్‌.. జాతికి చెందిన శునకాలను నేర పరిశోధన కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన 15 జాగిలాలున్నాయి. వీటిని కంటికి రెప్పలా కాపాడేందుకు 15 మంది సిబ్బంది పనిచేస్తుంటారు.

* జాగిలాలు నమ్మిన బంట్లలా పనిచేస్తుంటాయి. వీటికిచ్చే శిక్షణ అనుసరించి జాగిలాల్లో ఒక్కోటి ఒక్కో ప్రత్యేకత కలిగి ఉన్నాయి. పేలుడు పదార్థాలను పసిగట్టేవి కొన్నయితే, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను గుర్తించేవి వేరే ఉంటాయి. నేరం జరిగిన చోట పరిసరాల్లో వాసన చూసి నిందితులు, అనుమానితులను గుర్తించేవి మరికొన్ని ఉన్నాయి.

సంరక్షణ ఇలా...

శునకాలకు ప్రతి రోజు ప్రోటీన్లతో కూడిన పౌష్టికాహారాన్ని విధిగా అందిస్తారు. ఒక్కో జాగిలం నిర్వహణకు నెలకు కనీసం రూ. 15 వేల నుంచి రూ. 20వేల వరకు పోలీసు శాఖ ఖర్చుపెడుతుంది. నెలనెలా వ్యాక్సిన్లు ఇప్పిస్తారు. శునకాల కోసం కేటాయించిన కంపెనీలకు చెందిన ఆహార పదార్ధాలు ఇస్తారు. శునకాల సేవలు తీసుకోవడమే కాదు, అవి మరణించాక కూడా ఎంతో గౌరవంగా పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

పిల్లల వలే సంరక్షించాలి:

క్లిష్టమైన కేసుల్లో నిందితులను గుర్తించేందుకు శునకాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. హత్యలు జరిగిన సమయంలో లేదా దొంగతనాలు చేసిన తర్వాత నిందితులను గుర్తించేందుకు ఉపయోగించే జాగిలాలను నిత్యం చిన్న పిల్లల తీరులో చూడాలి. పౌష్టికాహారం ఇవ్వాలి. ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తే మంచి ఫలితాలుంటాయి.

-నందు, జాగిలం నిర్వాహకుడు, హెడ్‌ కానిస్టేబుల్‌

ఇలా ప్రారంభం

విశ్వాసానికి మారుపేరైన శునకాల ప్రాధాన్యం ప్రతి ఒక్కరికీ తెలియాలనే ఉద్దేశంతో జంతు సంక్షేమ న్యాయవాది అయిన కొలీన్‌ పైజ్‌ అనే రచయిత జాతీయ కుక్కల దినోత్సవం కోసం కృషి చేశారు. మనకు మన మీద మన కుటుంబీకుల మీదే శ్రద్ధ ఎక్కువ. ఇవి మాత్రం యజమానిపై చూపే విశ్వాసం ఇంట్లోని వారూ చూపరు. ఒక కుక్కను పెంచుకుంటే అది యజమానిలో ఆనందం, సంతోషం నింపడానికి దోహదపడతాయి. ప్రేమ, అభిమానం, శ్రద్ధ చూపెడతాయి. చివరకు నవ్వించడంలోనూ సహాయ పడతాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 8,86,279 గృహాలు ఉండగా సుమారు 25,500 మంది వీటిని పెంచుతున్నారు.

ఒత్తిడి ఇట్టే మాయం

శునకం స్ట్రెస్‌ఫ్రీ ఆయుధం. రిలాక్స్‌నిచ్చే సాధనం. నా దగ్గరుంది పగ్‌ జాతి రకం. దీనిని ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌ నుంచి తెచ్చుకున్నా. ‘లియో’ అని నామకరణం చేశా. ఏటా దాని పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటాం. ఇది తోడుంటే ఎంతటి ఒత్తిడి అయినా సరే ఇట్టే మాయమవుతుంది.

- కరుకల అనితారెడ్డి, సీనియర్‌ సిటిజన్‌ అడ్వైజరీ బోర్డు సభ్యురాలు, వరంగల్‌

ఇవి లేకపోతే మేం ఉండలేం

మా ఇంట్లో చిక్కి, స్నప్ఫి, స్టెపు అనే మూడు శునకాలున్నాయి. పదేళ్ల క్రితం ఖమ్మం నుంచి తీసుకొచ్చాం. ఇవి లేకపోతే మేం ఉండలేం. ఇంట్లోకి పాములొస్తే ఇవే అరుపులతో మమ్మల్ని అప్రమత్తం చేశాయి.

- అరుణ, గృహిణి, డోర్నకల్‌

ఇదీ చదవండి: ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ ముందుకు.. కొత్త రెవెన్యూ చట్టం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.