వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులు బందోబస్తు చేపట్టారు. విధుల్లోకి చేరేందుకు వచ్చిన పలువురు ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తెల్లవారు జామున నుంచే డిపోల వద్ద మొహరించారు.
సమ్మె విరమణ తర్వాత విధుల్లోకి చేరేందుకు ఆర్టీసీ కార్మికులు ఒక్కొక్కరుగా డిపోల వద్దకు చేరుకున్నారు. మరో పక్క అధికారులు.. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా తాత్కాలిక కార్మికులతో బస్సులను నడిపిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ