వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాళోజి కూడలి నుంచి పలు విద్యార్థి సంఘాలు ప్రదర్శన చేపట్టారు. ఈరోజు పాఠశాలల బంద్కు పిలుపునిచ్చారు. ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులను కల్పించి నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. రాష్టంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఆందోళనాకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: నదిలో పడవ బోల్తా.. ఐదుగురు గల్లంతు