సంక్రాంతిని పురస్కరించుకుని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
జంపన్న వాగులో స్నానాలు ఆచరించి నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు సదుపాయాలు లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు. జంపన్నవాగు దగ్గర మహిళల కోసం స్నానాల గదులు ఏర్పాటు చేయకపోవటంతో మహిళా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి: బస్తీమే సవాల్: భోగి పండగ రోజు బీ-ఫారాల భోగం ఎవరికి పట్టనుందో..!