ETV Bharat / state

కాజిపేటలో దారికోసం ఆందోళన... స్పందించిన చీఫ్ విప్

కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో జరుగుతున్న రైల్వే లైన్ విస్తరణ పనులపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నడక కోసం ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ దీనిపై స్పందించారు. ఆందోళనకారుల డిమాండ్లను నెరవేర్చుతామని హామీ ఇచ్చారు.

author img

By

Published : Nov 10, 2020, 6:32 PM IST

people protest for pedestrian at kazipet in warangal urban district
దారికోసం ఆందోళన... స్పందించిన చీఫ్ విప్

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్​ సమీపంలో జరుగుతున్న మూడో లైన్ విస్తరణ పనులతో తమ ప్రాంతానికి దారి లేకుండా అవుతుందని 36 వ డివిజన్ బోడగుట్ట ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ వెళ్లి ఆందోళనకారులకు నచ్చచెప్పి ఆందోళన విరమింప చేశారు.

ఇదీ సంగతి

బోడగుట్ట ప్రాంత వాసులు కాజీపేట్​కి వెళ్లడానికి స్టేషన్​కి ఆనుకోని ఉన్న రైల్వే లైనే ప్రధాన మార్గం. నడక, ద్విచక్ర వాహనాల ద్వారా వీరు రాకపోకలు సాగించేవారు. మరో మార్గం ద్వారా కాజీపేట చేరుకోవాలంటే కనీసం 3 కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రైల్వే లైన్ విస్తరణ పనుల్లో భాగంగా ఆ భూమిని చదును చేసి లోతుగా మట్టి తీయడంతో స్థానికులు రాకపోకలకు అంతరాయం కలిగింది. తమ సమస్య పరిష్కారం కోసం రైల్వే లైన్ మీద నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జితో పాటు పట్టాలపై నుంచి నడక మార్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత వాసులు ఆందోళనకు దిగారు.

అధికారుల హామీ

విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ రైల్వే, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో కలిసి వెళ్లారు. దారిని తొలగించడం లేదని... ఎప్పటి లాగే ఆ దారిని వినియోగించుకోవచ్చని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఇతర శాఖల అధికారులతో బోడగుట్ట అభివృద్ధి కోసం చేస్తున్న ప్రణాళికను చీఫ్ విప్ వివరించారు. స్థానికుల డిమాండ్లను నెరవేర్చుతానని హామీ ఇచ్చి ఆందోళన విరమింపచేశారు.

ఇదీ చదవండి: పాసుపుస్తకాల కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.