వైద్యం వికటించి రోగి మృతి చెందిన ఘటన వరంగల్ నగరంలో వెలుగు చూసింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే వ్యక్తి మరణించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కరీమాబాద్‌కు చెందిన రవి అనే వ్యక్తి కడుపునొప్పితో సంరక్ష ఆస్పత్రిలో చేరాడు. చికిత్స చేస్తున్న క్రమంలో పరిస్థితి విషమించి మరణించాడు.
స్పందించలేదు..
ఆస్పత్రి ఎదుట బంధువులు ధర్నాకు దిగారు. డబ్బులు చెల్లించినప్పటికీ డాక్టర్లు సకాలంలో స్పందించలేదని ఆరోపించారు. ఆందోళనతో దవాఖానా సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. వారికి నచ్చజెప్పి నిరసన విరమింపజేశారు.
సందేహాలు..
ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో మృతుల సంఖ్య పెరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. నెల రోజుల వ్యవధిలో ముగ్గురు మరణించారని.. దవాఖానా వద్ద వారి బంధువులు ఆందోళనకు దిగడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరైన చికిత్స అందడం లేదని వైద్య అధికారులకు గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు.
ఇదీ చూడండి: 'కనీసం పెట్టుబడి రావడం లేదు.. ప్రభుత్వం ఆదుకోవాలి'