ETV Bharat / state

Pollution At Pakhal Lake : పాకాల సరస్సుకు పెనుశాపంగా ప్లాస్టిక్‌ వాడకం - ఆసియాలోనే ఏడో స్వచ్ఛమైన సరస్సు పాకాల

Pollution At Pakhal Lake :ఆసియాలోనే అత్యంత స్వచ్ఛమైన సరస్సులో ఒకటైన పాకాల.. క్రమంలో దాని రూపును కోల్పోతోంది. పర్యటకులు, స్థానికుల నిర్లక్ష్యం కారణంగా క్రమంగా కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. స్వచ్ఛతకు చిరునామాగా పేరొందిన పాకాల.. కాలుష్యానికి కేరాఫ్​గా మారిపోతోంది.

Pakhal Lake
పాకాల సరస్సు
author img

By

Published : Dec 12, 2021, 2:23 PM IST

Pollution At Pakhal Lake : పాకాల సరస్సుకు పెనుశాపంగా ప్లాస్టిక్‌ వాడకం

Pollution At Pakhal Lake: చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం. ఎన్నో రకాల పక్షి జాతులు, ప్రకృతి సోయగాలకు నెలవైన ప్రదేశం. పర్యాటకులకు స్వర్గధామం.. పాకాల సరస్సు. స్వచ్ఛతకు చిరునామాగా పేరొంది.. ఆసియాలోనే ఏడో స్వచ్ఛమైన సరస్సుగా నిలిచింది. ఇలా ఎన్నో విశిష్టతలున్న ఈ సరస్సుకు ప్లాస్టిక్‌ మహమ్మారి పెనుశాపంగా మారింది. సందర్శకులు, సమీప ప్రాంతాల ప్రజలు విచ్ఛలవిడిగా ప్లాస్టిక్‌ వాడకంతో పాకాల సరస్సు క్రమంగా కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది.

Pakhal Lake
పాకాల సరస్సు

విచ్చల విడిగా ప్లాస్టిక్​ వినియోగం..

కాక‌తీయుల పాలనకు సజీవ సాక్ష్యం. అన్నదాతలకు అండగా... ప్రకృతి ప్రేమికుల కనువిందు చేసే మంచినీటి సరస్సు పాకాల క్రమంగా కలుషితమవుతోంది. వరంగల్‌ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఈ సరస్సు ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలుస్తోంది. వందలాది మొసళ్లకు ఆవాసంగా ఉన్న పాకాల.. ప్లాస్టిక్‌ వినియోగం శాపంగా మారుతోంది. చెరువు పరిసర గ్రామాల ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు విచ్ఛలవిడిగా ప్లాస్టిక్‌ వాడుతున్నారు. కవర్లు, వాటర్‌ బాటిళ్లు, ఇతర ఆహార పొట్లాలను ఇష్టానుసారంగా సరస్సు పరిసరాల్లో వేస్తుండటంతో అవన్నీ సరస్సులోకి కొట్టుకువస్తున్నాయి.

ఇలా అయితే మనుగడకే ముప్పు..

పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ నిషేధాన్ని కొన్నిచోట్ల అమలుచేస్తున్నా.. పాకాల వద్ద విచ్ఛలవిడిగా వాడుతున్నారు. హైదరాబాద్‌ జూపార్కులో ప్లాస్టిక్​ వాడకాన్ని పూర్తిగా నిషేధించిన అధికారులు.... లోనికి పంపే ముందుకు పక్కాగా తనిఖీలు చేస్తున్నారు. సందర్శకులు ప్లాస్టిక్‌ వస్తువులతో వస్తే వాటిని అనుమతించటంలేదు. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలిచే పాకాల వద్ద సైతం ఇదే నిబంధనలు విధిస్తే.... కాలుష్యం బారిన పడకుండా కాపాడే అవకాశముంటుంది. లేదంటే భవిష్యత్తులో సరస్సు మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.

ఇదీచూడండి: AP CM Jagan Flexi Hulchul : 'జగన్ అన్న ఉన్నాడు.. జాగ్రత్త'.. బోర్డు కలకలం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.