ETV Bharat / state

గుండెపోటుతో బ్యాంకులోనే వృద్ధురాలు మృతి - warangal urban district news

కష్టపడి కూడబెట్టుకుని ఫిక్స్​డ్​ డిపాజిట్ చేసుకున్న డబ్బుల కోసం బ్యాంకుకు వ​చ్చిన వృద్ధురాలు... అక్కడే గుండెపోటుతో కన్నుమూసిన హృదయవిదారక ఘటన వరంగల్​ పట్టణ జిల్లా ముల్కనూరులో జరిగింది. వృద్ధురాలి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

old woman died in bank with heart attack in warangal urban district
గుండెపోటుతో బ్యాంకులోనే వృద్ధురాలు మృతి
author img

By

Published : Aug 18, 2020, 6:14 PM IST

ఫిక్స్​డ్​ డిపాజిట్ డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన ఓ వృద్ధురాలు బ్యాంకులోనే గుండెపోటుతో మృతి చెందిన సంఘటన వరంగల్ పట్టణ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్​లో చోటుచేసుకుంది. ముల్కనూరులోని ఎస్బీఐ బ్యాంకులో గతంలో ఫిక్స్​డ్ డిపాజిట్ చేసిన తన డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి బొల్లంపల్లి రాజమ్మ (70) అనే వృద్ధురాలు బ్యాంకు వద్దకు రాగా... బ్యాంకులో ఉండగానే హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి పడిపోయింది. బ్యాంకు సిబ్బంది వెంటనే సమీపంలోని వైద్యులను తీసుకువచ్చి చూపించగా రాజమ్మ మరణించినట్లు వైద్యులు తెలిపారు.

విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి ఏకైక కుమారుడు 10 సంవత్సరాల క్రితం మరణించగా కుమార్తె, కోడలు ఉన్నారు. రాజమ్మ మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

ఇవీ చూడండి: ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం.. వైద్యం వికటించి యువకుడు మృతి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.