ఇవీ చూడండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ వాసి మృతి
ఇంటి నుంచి అదృశ్యమై మరణించిన వృద్ధుడు - కాజీపేట
ఇంటి నుంచి తప్పిపోయిన ఓ వయోవృద్ధుడు మృత్యవాత పడ్డాడు. కాజీపేట విష్ణుపురికి చెందిన రావుల రాంనారాయణ అనే వృద్ధుడు ఈ నెల 14న తప్పిపోయాడు. కుమారుల ఫిర్యాదుతో వెతికిన పోలీసులకు సోమవారం నాడు వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రీన్‌సిటీ వెంచర్లో కుళ్లిన మృతదేహం కనబడింది. ఆ మృతదేహం రావుల రాంనారాయణదిగా మృతుడి బంధువులు తెలిపారు.
మరణించిన వయోవృద్ధుడు
వృద్ధాప్యం, మతి పరుపు కారణంగా ఇంటి నుంచి తప్పిపోయి వయోవృద్ధుడు మృత్యువాత పడిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలో చోటుచేసుకుంది. కాజీపేట విష్ణుపురికి చెందిన రావుల రాంనారాయణ భార్య చనిపోగా అక్కడే కుమారుల వద్ద ఉంటున్నాడు. ఈ నెల 14న ఆ వృద్ధుడు ఇంటి నుంచి తప్పిపోగా... కుమారులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మడికొండ గ్రీన్ సిటీ వెంచర్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో కుళ్ళిన స్థితిలో వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు మరణించి నాలుగు రోజులకు పైగా అయి ఉంటుందని వారు తెలిపారు. ఆ మృతదేహం తమ తండ్రిదిగా మృతుడి కుమారులు ధ్రువీకరించారు. వయోభారం, ఆకలి, ఎండ వేడిమి లాంటి కారణాలతో వృద్ధుడు చనిపోయి ఉంటాడని కుటుంబీకులు, పోలీసులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ వాసి మృతి
TG_WGL_11_24_INTI_NUNDI_THAPPI_POYI_VRUDDHUDI_MRUTHI_AV_C12
CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION
( ) వృద్దాప్యం, మతి పరుపు కారణంగా ఇంటి నుండి తప్పిపోయి వయోవృద్ధుడు మృత్యువాత పడిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలో చోటుచేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ విష్ణుపురికి చెందిన రావుల రాంనారాయణ అనే వృద్ధుడుకి భార్య చనిపోగా కాజీపేట్ లోని కుమారుల వద్ద ఉంటున్నాడు. ఈ నెల 14 వ తేదిన అతను ఇంటినుండి తప్పిపోగా... కుమారులు కాజీపేట్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసి తండ్రి కోసం వెతకటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మడికొండ గ్రీన్ సిటీ వెంచర్ లోని నిర్మానుష్య ప్రాంతంలో కుళ్ళిన స్థితిలో వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు మరణించి నాలుగు రోజులకు పైగా అయి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆ మృతదేహం తమ తండ్రి రాంనారాయణదిగా అతని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. వయోభారం, ఆకలి, ఎండవేడిమి వంటి కారణాలతో వృద్ధుడు మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులు, పోలీసులు భావిస్తున్నారు.