ETV Bharat / state

కళాశాలలో సరైన ఆహారం లేదంటూ నర్సింగ్ విద్యార్థినుల ఆందోళన - సెయింట్​ ఆన్స్​ నర్సింగ్ కళాశాల

Nursing students protest:సరైన వసతులు కల్పించకుండా తమను వేధిస్తున్నారంటూ నర్సింగ్​ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హనుమకొండ జిల్లాకేంద్రంలోని సెయింట్​ ఆన్స్​ నర్సింగ్ కళాశాల ఎదుట నినాదాలు చేశారు. తమను కళాశాల యాజమాన్యం బ్లాక్​ మెయిల్​ చేస్తోందంటూ విద్యార్థినులు ఆరోపించారు.

Nursing students protest
సెయింట్​ ఆన్స్​ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల ఆందోళన
author img

By

Published : Jan 13, 2022, 5:21 PM IST

Nursing students protest: సరైన ఆహారం అందించకుండా కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ కళాశాల ఎదుట నర్సింగ్ విద్యార్థులు ధర్నా చేపట్టారు. నెలకు రూ.3000 చెల్లిస్తున్న కూడా కనీస సౌకర్యాలు సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. హనుమకొండ జిల్లాకేంద్రంలోని సెయింట్ ఆన్స్​ కళాశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బ్లాక్​ మెయిల్ చేస్తున్నారు

st ann's nursing college: కళాశాలకు రాకపోతే రూ.300 ఫైన్ వేస్తూ తమను బ్లాక్​ మెయిల్ చేస్తున్నారని నర్సింగ్ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందించడం లేదని వాపోయారు. కలుషిత ఆహారంతో చాలా మందికి ఫుడ్​ పాయిజన్​ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆరోగ్యం గురించి కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. తక్షణమే కళాశాల యాజమాన్యం మా సమస్యలను పరిష్కరించాలని నర్సింగ్ విద్యార్థినులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని వారితో మాట్లాడారు.

మేం డే స్కాలర్​ అయినా కూడా మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. ఐదు నిమిషాలు ఆలస్యమైనా కూడా రూ.300 ఫైన్​ వేస్తున్నారు. ఇవ్వకపోతే ప్రతి రోజు వంద రూపాయలు అదనంగా ఇవ్వమంటున్నారు. ఫుడ్ అయితే ఏం మాత్రం బాగుండదు. పేరెంట్స్​కు ఫోన్​ చేసి ఎలా పడితే అలా అరుస్తున్నారు. మా ఫ్రెండ్స్​ చాలామందికి ఫుడ్​ పాయిజన్​ అయింది. సర్టిఫికెట్లు ఇవ్వమని బ్లాక్ మెయిల్​ చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలి. ఇలా మేం ఆందోళన చేసినా కూడా మామ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు.- నర్సింగ్​ విద్యార్థిని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.