ETV Bharat / state

వసతిగృహంలో సౌకర్యాలపై నర్సింగ్​ విద్యార్థుల ఆందోళన - వసతిగృహంలో సౌకర్యాలపై నర్సింగ్ విద్యార్థినుల ఆందోళన

వసతిగృహంలో సరైన సౌకర్యాలు కల్పించాలని నర్సింగ్ విద్యార్థినులు డిమాండ్ చేశారు. వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని జయ నర్సింగ్​ కళాశాల ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.

nursing students dharna on no facilities in hostel in hanamkonda in warangal urban district
వసతిగృహంలో సౌకర్యాలపై నర్సింగ్​ విద్యార్థుల ఆందోళన
author img

By

Published : Feb 25, 2021, 5:43 PM IST

వసతిగృహంలో సరైన సౌకర్యాలు లేవంటూ నర్సింగ్ విద్యార్థినులు ధర్నా చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వరంగల్ అర్బన్​ జిల్లా హన్మకొండలోని జయ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. వసతి గృహంలో కనీస వసతులు లేవని ఆరోపించారు. కళాశాల నుంచి ఇంటికి వెళ్లాలంటే రూ.500 డిపాజిట్​ చేస్తున్నామని వాపోయారు.

అధిక ఫీజులు తీసుకుంటూ నాసిరకం ఆహారం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహంలో సరైన సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సరైన వసతులు కల్పించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

ఇదీ చూడండి : యాదాద్రి పాతగుట్టలో కన్నులపండువగా వార్షిక బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.