వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఖమ్మం-కరీంనగర్ జిల్లాల నుంచి మామిడి రాకతో వరంగల్ అర్బన్ జిల్లా ధర్మారంలోని గిడ్డంగుల ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక పండ్ల మార్కెట్ మామిడి పండ్ల వాహనాలతో కళకళలాడుతుంది. మార్కెట్ యార్డులో భౌతిక దూరం పాటించకుండా గుంపులు, గుంపులుగా మామిడి క్రయ విక్రయాలు జరగడం భయాందోళనకు గురి చేస్తోంది.
మార్కెట్ యార్డులో విచ్చలవిడిగా క్రయ విక్రయాలు చేస్తూ... కనీసం మాస్కులు కూడా ధరించట్లేదు. నిబంధనలను ఉల్లంఘిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో మార్కెట్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారని ఈటీవీ-భారత్ ప్రతినిధి మార్కెట్ కార్యదర్శి సంగయ్యని వివరణ కోరగా... స్పందించకుండా వెళ్లిపోయారు.
ఇవీ చూడండి: హైదరాబాద్‌లోనూ ఆయువు తీసే వాయువులెన్నో?