వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్‌లో నిర్వహించిన జాతీయ యువజనోత్సవ వేడుకలో వివిధ పాఠశాల విద్యార్థులు సందడి చేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి సుమారు 2వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.
డ్రోన్, రోబోటిక్ కార్ల తయారీలో వినియోగించే సాంకేతికత మొదలగు అంశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అవి పనిచేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా వివరించి చెప్పారు.
వరంగల్ నిట్ విద్యార్థులు ఉపయోగించి తయారుచేసిన డ్రోన్‌ను గాలిలో ఎగరవేయడాన్ని పాఠశాల విద్యార్థులు ఆసక్తిగా గమనించారు. వీటితో పాటుగా నిట్‌లోని వివిధ విభాగాలకు సంబంధించిన ప్రయోగశాలలను విద్యార్థులు సందర్శించారు.
- ఇదీ చూడండి : తొలిసారిగా... సీఎం హోదాలో సీబీఐ కోర్టుకు జగన్