గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భాజపా నాయకులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 19వ డివిజన్ అభ్యర్థి మంతెన జయలక్ష్మి మహిళలతో కలిసి ప్రచారంలో దూసుకుపోతున్నారు.
డివిజన్‌ని అభివృద్ధి చేయడంలో గత కార్పొరేటర్ విఫలమయ్యారన్నారు. తనను అధిక మెజారిటీతో గెలిపించాలని.. 19వ డివిజన్‌ను మోడల్ డివిజన్‌గా తీర్చిదిద్దుతానని ఓటర్లకు విన్నవించారు. పేకాటరాయుళ్లకి తెరాస టికెట్ ఇవ్వడం వల్ల తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: తెలంగాణలో తొలిసారి 8వేలు దాటిన కరోనా కేసులు