వరంగల్ అర్బన్ హన్మకొండలో ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నాకు దిగారు. మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ వర్గానికి చెందిన వారికి స్థానం కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విగ్రహం ముందు బైఠాయించారు. సీఎం కేసీఆర్ ఎస్సీ సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నారని... వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదనే ధోరణితో వ్యవహరిస్తున్నారని మంద కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు 5 మంది ఉండగా ఇప్పుడు మరొకరికి స్థానం కల్పించారని... వెలమ సామాజిక వర్గంలో సీఎం కేసీఆర్తో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉండగా ప్రస్తుతం మరో ఇద్దరిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారని ధ్వజమెత్తారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాత్రం ఒక్కరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం అన్యాయమని మంద కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రివర్గ విస్తరణపై ఎమ్మార్పీఎస్ నాయకుల ఆందోళన
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు స్థానం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హన్మకొండలో ధర్నా నిర్వహించారు.
వరంగల్ అర్బన్ హన్మకొండలో ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నాకు దిగారు. మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ వర్గానికి చెందిన వారికి స్థానం కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విగ్రహం ముందు బైఠాయించారు. సీఎం కేసీఆర్ ఎస్సీ సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నారని... వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదనే ధోరణితో వ్యవహరిస్తున్నారని మంద కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు 5 మంది ఉండగా ఇప్పుడు మరొకరికి స్థానం కల్పించారని... వెలమ సామాజిక వర్గంలో సీఎం కేసీఆర్తో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉండగా ప్రస్తుతం మరో ఇద్దరిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారని ధ్వజమెత్తారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాత్రం ఒక్కరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం అన్యాయమని మంద కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION
( ) నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు స్థానం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హనుమకొండ అంబేద్కర్ కూడలి వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ విభాగాలు, దళిత సంఘాలు ఈ ధర్నాను నిర్వహించాయి. సీఎం కేసీఆర్ మాదిగ సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నారని.... వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదనే ధోరణి తో వ్యవహరిస్తూ... అణిచివేత కు గురి చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ ధ్వజమెత్తాడు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు 5 మంది ఉండగా ఇప్పుడు మరొకరికి స్థానం కల్పించారని.... వెలమ సామాజిక వర్గంలో సీఎం కేసీఆర్ తో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉండగా ప్రస్తుతం మరో ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారని... పార్టీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న మాదిగ సామాజిక వర్గం నుండి మాత్రం ఒక్కరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం అన్యాయమని తెలిపారు. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ జిల్లా, మండల, గ్రామీణ స్థాయిలో ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంబేద్కర్ కూడా కూడలి వద్ద ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.
byte...
మంద కృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు.
Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION
Conclusion:9000417593