ETV Bharat / state

Mother Complaint: 'అయ్యా.. నా కొడుకులను బుక్కెడు బువ్వ పెట్టమనండయ్యా..' - కుమారులపై తల్లి ఫిర్యాదు

Mother Complaint Against Sons to District Collector: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కన్నబిడ్డలే రోడ్డున పడేస్తున్నారు. వారి పేరున ఉన్న భూమిని మాయమాటలతో అన్యాయంగా కాజేసీ వారి పేరున పట్టా చేయించుకుంటున్నారు. ఏంటని అడిగినందుకు ఆ కన్నవారినే ఇబ్బంది పెడుతున్నారు. కనీ.. పెంచి.. పెద్ద చేసినందుకు వృద్ధాప్యంలో ఒక్క పూట అన్నం కోసం చేయి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారు. వారి గోడు ఎవరికీ విన్నవించుకోవాలో తెలియక తల్లిదండ్రులు నానా కష్టాలు పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హనుమకొండ జిల్లాలో జరిగింది.

Mother Complaint
Mother Complaint
author img

By

Published : Apr 25, 2023, 2:25 PM IST

Mother Complaint Against Sons to District Collector: కనిపెంచిన తల్లిదండ్రులను పోషించడాన్ని నేటితరం పిల్లలు భారంగా ఫీలవుతున్నారు. వారికి బుక్కెడు అన్నం పెట్టడానికి కూడా మనసు రావడం లేదు. ప్రేమానురాగాలను పంచిన ఆ తల్లిదండ్రులనే వీధిన పడేస్తున్నారు. కన్న తల్లిదండ్రులని చూడకుండా ఆస్తి, పాస్తులని లెక్కలేసుకుని గిరిగీసుకుని బతుకుతున్నవారు ఎందరో.. కన్నవారికి కొంచె అన్నం పెట్టలేక వంతులేసుకొని వారిని భారంగా అనుకుంటున్నారు.

కనీ.. పెంచి.. పెద్దచేసినందుకు వృద్ధాప్యంలో ఇలా: వాస్తవం చెప్పాలంటే.. తల్లిదండ్రుల పేరు మీద ఆస్తులున్నంత వరకే వారికి విలువ ఇస్తున్నారు నేటి తరం పిల్లలు. కన్నవాళ్లు కాటికి కాలు చాపే వయసు రాగానే.. ఏదో ఒక మాయ మాటలు, కాకమ్మ కథలు చెప్పి వారి నుంచి ఆస్తి తీసేసుకుని చివరకు మాకు అక్కర్లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. కనీ.. పెంచి.. పెద్దచేసినందుకు వృద్ధాప్యంలో ఒక్క పూట అన్నం కోసం చేయి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారు. వారి గోడు ఎవరికి విన్నవించుకోవాలో తెలియక తల్లిదండ్రులు నానా కష్టాలు పడుతున్నారు. అలాంటి ఘటనే హనుమకొండ జిల్లాలో జరిగింది.

Mother Complaint on Sons: ఆ తల్లి నవమాసాలు మోసి కుమారులకు జన్మనిచ్చింది. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటికి ఎదురు నిలబడి కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేసింది. పెళ్లిళ్లు కూడా జరిపించి ఓ ఇంటి వారిని చేసింది. అనుకోకుండా కట్టుకున్న భర్త మరణించారు. తండ్రి దూరమైన తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి.. ఆ కుమారులు ఆమెకు తిండిపెట్టకుండా రోడ్డున పడేశారు. ఆమె కష్టపడి దాచిపెట్టిన సొమ్మంతా లాక్కున్నారు. చివరికి ఆమె దగ్గర ఏం లేకపోవడంతో.. అభాగ్యురాలిగా కుమార్తెలు, బంధువుల ఇంట్లో ఉంటూ జీవిస్తోంది.

వివరాలలోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం మర్రిపల్లిగూడేనికి చెందిన ఇనుగాల రాజమ్మ, పోశయ్య దంపతులు. వీరికి ఆరుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. అందరికీ వివాహాలు జరిగాయి. ముగ్గురు కుమారులు ఉండడంతో ఒకరిని చిన్నతనంలోనే దత్తత ఇచ్చారు. మిగిలిన ఇద్దరు కుమారులు ఆమె వద్దనే ఉంటూ జీవనం సాగించేవారు. ఆమె భర్త ఏడేళ్ల క్రితం మరణించారు. ఉన్న ఇల్లు కూడా కూలిపోగా.. ఆ స్థలంలోనే చిన్నకుమారుడు భవనం నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ఆమెకు ఉన్న ఎకరం పట్టాభూమి సైతం పింఛన్‌ ఇప్పిస్తామని నమ్మబలికి సంతకాలు పెట్టించుకొని తన పేరుమీదకి పట్టా చేసుకున్నారు ఆ కుమారులు.

బుక్కెడు అన్నం కోసం ఆ తల్లి వేధన: రెండో కుమారుడు ఈమెకు వచ్చే పింఛన్‌ డబ్బులను బ్యాంకులో తాకట్టు పెట్టి మరీ లోన్‌ తీసుకున్నాడు. ఆమెకు వచ్చే పింఛన్ ప్రతి నెలా లోన్‌కే పోతోంది. బతకడానికి నిర్వహణ ఖర్చులు ఇవ్వమన్నా లేవంటూ విసుక్కుంటున్నారు. బుక్కెడు అన్నం కూడా పెట్టకుండా రోడ్డున పడేశారు. మళ్లీ తిరిగి వాళ్ల దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా మాట్లాడుతూ వెళ్లి పొమ్మంటున్నారని బాధితురాలు వాపోయింది.

విసిగిపోయిన ఆ వృద్ధురాలు సోమవారం వారి బంధువులతో కలిసి హనుమకొండ కలెక్టరేట్‌కు వెళ్లింది. తన గోడును కలెక్టర్‌ ముందు వెళ్లబోసుకుంది. కుమారుల నుంచి నిర్వహణ ఖర్చులు ఇప్పించాలని, లేదంటే తన భూమిని తిరిగి తనకే వచ్చేలా చర్యలు తీసుకోవాలని మొరపెట్టుకుంది. ఈ మేరకు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ దరఖాస్తును పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.