మనుషులపై కరోనా పంజా విసురుతున్న వేళ... వానరాలు ఆకలి మంటతో అలమటిస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో ఎవ్వరూ బయటకి రాకపోవడం వల్ల కోతులకు ఆహారం పెట్టేవారే కరువయ్యారు.
వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయంలో పదుల సంఖ్యలో కోతులు ఆకలితో అలమటిస్తున్నాయి. కొద్ది ఆహారం దొరికినా పోటీపడి లాక్కుతింటున్నాయి. కష్టకాలంలో మూగజీవాల ఆకలి తీర్చడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి : వెళ్లలేరు.. ఉండలేరు..