ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాల నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వరంగల్ అర్బన్ జిల్లా అగ్నిమాపక అధికారులు అవగాహన నిర్వహించారు. హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో... అగ్నిప్రమాదం సంభవిస్తే.. ఏం చేయాలి. దట్టమైన పొగలో చిక్కుకుని ఊపిరాడని పరిస్ధితుల్లో రోగుల ప్రాణాలు ఎలా రక్షించాలన్నదీ అక్కడి సిబ్బందికి వివరించారు.
ఆందోళనకు గురి కాకుండా ఆసుపత్రిలో ఉన్న అగ్నిమాపక పరికరాలను ఎలా ఉపయోగించాలన్నదీ తెలియజేశారు. ఆసుపత్రులు, బస్టాండ్లు, జనసమ్మర్ధ ప్రాంతాల్లో ప్రతీ వారం ఈ తరహా కార్యక్రమాలు చేపట్టి.. ప్రజలకు అవగాహన కలిగిస్తున్నామని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి : 'జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం'