కరోనా వైరస్ పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ సూచించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ మేరకు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పలు కాలనీల్లో వినయ్ భాస్కర్ పర్యటించారు. కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. మాస్కులు పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 31 వరకు అందరూ ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను తప్పని సరిగా జిల్లా అధికారులకు తెలపాలని ప్రజలకు సూచించారు. కరోనా వ్యాప్తి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని.. ధైర్యంగా ఉండాలని తెలిపారు.
ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్: పది పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీ చర్యలు