నాలాలు పునరుద్ధరించడానికి తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వతంగా ఉండేలా తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అధికారులను ఆదేశించారు. రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జలమయమైన లోతట్టు ప్రాంతాలను సందర్శించారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి...
నాలాల్లో ప్రవహిస్తున్న నీటి ఉద్ధృతి, దెబ్బతిన్న కాలువలను పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్లు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కర్నాటక మీదుగా ఆవర్తనం.. దక్షిణ తెలంగాణకు వర్షగండం