ETV Bharat / state

మంత్రి ఆదేశం.. విద్యార్థులకు ఎమ్మెల్యే సాయం - mla vinay bhaskar helps students from punjab

పంజాబ్​ నుంచి రాష్ట్రానికి వస్తోన్న తెలుగు విద్యార్థులకు మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వరంగల్​ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్ ఆహార ప్యాకెట్లు అందజేశారు. సకాలంలో స్పందించిన ఎమ్మెల్యేకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

mla vinay bhaskar distributed food packets to students who are coming from punjab
వరంగల్​ విద్యార్థులకు భోజన ప్యాకెట్లు
author img

By

Published : May 15, 2020, 11:37 AM IST

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు దాస్యం వినయ్​ భాస్కర్ పంజాబ్ నుంచి వస్తోన్న విద్యార్థులకు వరంగల్ రైల్వే ప్రాంగణంలో ఆహార పొట్లాలు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు.

పంజాబ్​లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుతున్న 1,100 మంది విద్యార్థులు ప్రత్యేక రైల్లో వరంగల్​కు వస్తున్నారు. భోజన వసతి లేక తాము ఆకలితో అలమటిస్తున్నామని విద్యార్థులు మంత్రి కేటీఆర్​కు ట్విటర్​ వేదికగా తెలిపారు.

స్పందించిన మంత్రి కేటీఆర్.. విద్యార్థులకు భోజన వసతి కల్పించాలని వరంగల్​ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే హుటాహుటిన భోజనం తయారు చేపించి, 1100 మంది విద్యార్థులకు భోజన ప్యాకెట్లు అందజేశారు. సమయానికి విద్యార్థుల ఆకలి తీర్చిన వినయ్​ భాస్కర్​కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.