వరంగల్ అర్బన్ జిల్లా పరకాల మున్సిపాలిటీని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా మారుస్తానని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
రూ. 20 లక్షలతో హరిజనవాడలో కమ్యూనిటీ టాయిలెట్స్, రూ.35 లక్షలతో మాదారం మెయిన్ రోడ్డు నుంచి బంధం రోడ్డు వరకు సీసీ రోడ్డు, రూ.15.50 లక్షలతో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణ పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు.
ఇద చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ