వరంగల్ గ్రామీణ జిల్లా కీర్తినగర్‌లో నిర్మితమవుతున్న బ్రాహ్మణ భవన భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందులో భాగంగా వారి అభివృద్ధి కోసం ఏడాదికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ రమణాచారి కృషితో హైదరాబాద్‌లో త్వరలోనే బ్రాహ్మణ సదన్‌ను ప్రారంభిస్తామని చల్లా చెప్పారు. భవన నిర్మాణానికి తనవంతు సాయం అందిస్తానని ఎమ్మెల్యే అన్నారు. అర్చక సమైక్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించి, ఆశీర్వచనాలు అందజేశారు.
ఇదీ చూడండి: ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో నూతన విధానం