ముఖ్యమంత్రి కేసీఆర్ పది కాలాలపాటు చల్లగా ఉండాలని భద్రకాళి అమ్మవారిని వేడుకున్నారు మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. ముందుగా భద్రకాళి అమ్మవారికి బతుకమ్మ చీరలు కానుకగా సమర్పించారు. అనంతరం అర్హులైన పేదలకు చీరలను పంపిణీ చేశారు.

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాఠోడ్తో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, మేయర్ గుండా ప్రకాష్ పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచులకు అన్నగా, మేనమామగా, తండ్రిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో అర్హులైన పేదలకు కోటి చీరలు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. గత ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేయగా... ఈ ఏడాది భద్రకాళి అమ్మవారి నుంచి చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ఏకపక్షంగా కాంట్రాక్టు రద్దు చేయడం సరికాదు: హైకోర్టు