ETV Bharat / state

నేడు వరంగల్​కు కేటీఆర్​.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి - telangana latest news

వరంగల్​ మహానగరంలో మంత్రి కేటీఆర్ నేడు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి ఎర్రబెల్లి ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలో త్వరలోనే పుర పోరుకు నగారా మోగనున్న నేపథ్యంలో.. కేటీఆర్​ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

minister ktr warangal tour
నేడు వరంగల్​కు కేటీఆర్​.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Apr 11, 2021, 2:22 PM IST

Updated : Apr 12, 2021, 12:26 AM IST

రాష్ట్రంలో వరంగల్‌ మహానగరంతో పాటు మరికొన్ని చోట్ల పుర పోరుకు నగారా మోగనుంది. ఈ క్రమంలో తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఓరుగల్లుపై ప్రత్యేక దృష్టి సారించారు. రాజధాని తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌లో ఏప్రిల్‌ నెలాఖరుకు జరగబోయే బల్దియా ఎన్నికల్లో భారీ మెజారిటీతో నెగ్గడాన్ని గులాబీ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్‌ స్వయంగా అన్నీ తానై వ్యవహరించేందుకు సిద్ధపడ్డట్టు తెలుస్తోంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో చివరకు మేయర్‌ పీఠం కైవసం చేసుకున్నా.. ఫలితం ఆశించిన మేరకు రాకపోవడంతో మళ్లీ అక్కడ జరిగిన పొరపాట్లు ఇక్కడ పునరావృతం కాకుండా ఉండేందుకు కేటీఆర్‌ ఓరుగల్లు పోరుకు వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తోంది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకన్నా ముందే వరంగల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఒకవైపు సాగర్‌ ప్రచారం ముగియక ముందే ఓరుగల్లులో అభివృధ్ధి కార్యక్రమాల ప్రారంభానికి ఏప్రిల్‌ 12న కేటీఆర్‌ పర్యటన ఖరారైంది. నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నప్పటికీ.. పార్టీ పరంగా ఈ పర్యటన ఎంతో కీలకం కానుంది. బల్దియా పోరును పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకోవాలని నిర్ణయించిన కేటీఆర్..‌ పార్టీ పరంగా లోతైన సమీక్ష నిర్వహించేందుకు సోమవారం నేతలతో భేటీ కానున్నట్టు సమాచారం.

ఇప్పటికే హైదరాబాద్‌లో పలుమార్లు మంత్రులు, ఎమ్మెల్యేలతో వరంగల్‌ ఎన్నికల దృష్ట్యా సమావేశమై కేటీఆర్‌ పార్టీ పరిస్థితి, సిట్టింగ్‌ల పనితనం, అందులో గెలుపుగుర్రాల వివరాలతోపాటు, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న వారి చిట్టా కూడా సేకరించి పెట్టుకొన్నట్టు సమాచారం. పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఆచితూచి వ్యవహరించనున్నారు. హైదరాబాద్‌లో మెజారిటీ స్థానాల్లో సిట్టింగ్‌లకు మళ్లీ టికెట్లు ఇవ్వడంతో అనేక మంది ఓటమి పాలయ్యారు. ఆయా స్థానాల్లో భాజపా నెగ్గింది. ఈ క్రమంలో వరంగల్‌లో అభ్యర్థుల ఎంపికలో విషయంలో కేటీఆర్‌ స్వయంగా పరిశీలించి ఆమోదించాకే టికెట్లు ఖరారు చేస్తారని సమాచారం. ఆది నుంచి తెరాస అన్ని ఎనికలకు సర్వే ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసినట్టే ఈ ఎన్నికల్లో కూడా డివిజన్ల వారీగా సర్వే చేపట్టి దాని ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలకు పరీక్ష

బల్దియా ఎన్నికల్లో పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపం కనిపించకుండా అంతా కలిసికట్టుగా పనిచేయాలని కూడా కేటీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. కొందరు నేతల మధ్య పొరపొచ్ఛాలు ఉండడం వల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉన్నందున సమన్వయంగా పనిచేయడానికి శ్రేణులతో విడివిడిగా మాట్లాడే అవకాశం ఉంది. పైగా నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలపైనే పెట్టనున్నారు. వారి పరిధిలో సీట్లు తగ్గినా అది వారి పనితీరుకు నిదర్శనంగా అధిష్ఠానం చూడాల్సి ఉంటుందని కేటీఆర్‌ హెచ్చరికలాంటి సూచనలు చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యాక కేటీఆర్‌ పలుమార్లు నగరంలో పర్యటించి పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేస్తారని సమాచారం. మొత్తంగా ఓరుగల్లు మేయర్‌ పీఠాన్ని కచ్ఛితంగా నెగ్గాలని కేటీఆర్‌ పట్టుదలతో ఉన్నట్టు సమాచారం.

ఏర్పాట్లలో మంత్రి

ఏర్పాట్లలో మంత్రి

నగరంలో ఈ నెల 12న మంత్రి కేటీఆర్‌ పర్యటన పురస్కరించుకుని ఆయా ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి శనివారం పరిశీలించారు. కేటీఆర్‌ ప్రారంభించనున్న పలు అభివృద్ధి పనులను ఆయన సందర్శించారు. వరంగల్‌ ఎల్బీనగర్‌లోని షాదీఖాను కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, మునిసిపల్‌ కమిషనర్‌ పమేలాసత్పతి బృందంతో కలిసి మంత్రి పరిశీలించారు. వరంగల్‌ కూరగాయల మార్కెట్లో నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని, సాయంత్రం వరంగల్‌ లేబర్‌కాలనీ వంద అడుగుల రహదారిని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తోకలిసి పరిశీలించారు. మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా ఖిలావరంగల్‌ క్రీడామైదానంలో నిర్వహించనున్న సభ ప్రాంగణాన్ని శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, మ.న.స. కమిషనర్‌ పమేలా సత్పతి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి పరిశీలించారు. ఏర్పాట్లు, భద్రతపై సమీక్ష జరిపారు. తూర్పు నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్న జర్నలిస్ట్‌ కాలనీ ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయార్‌రావు పరిశీలించారు.

ఇదీ చూడండి: కేటీఆర్​ పర్యటన విజయంవంతం చేయాలని బైక్ ర్యాలీ

Last Updated : Apr 12, 2021, 12:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.