ETV Bharat / state

ముంపులోనే జీవనం... కొనసాగుతున్న వరద ఉద్ధృతి - తెలంగాణ తాజా వార్తలు

భారీ వర్షాలకు అతలాకుతలమైన వరంగల్‌లో మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు..... వరంగల్‌లో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారు. వరదలు, కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించి... నిర్ణయాలు తీసుకోనున్నారు.

ముంపులోనే జీవనం...  కొనసాగుతున్న వరద ఉద్ధృతి

author img

By

Published : Aug 18, 2020, 5:14 AM IST

ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు... వరంగల్‌ వాసుల ఇక్కట్లు ఇంకా తీరడం లేదు. వాగులు వంకల ఉద్ధృతి తగ్గలేదు. వానలు తగ్గుముఖం పట్టినా... పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మురికివాడలు, శివారు ప్రాంత కాలనీ వాసుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. వరదలు, పంట నష్టం తదితర అంశాలపై మంత్రులు ఎర్రబెల్లి దయకర్ రావు, సత్యవతి రాఠోడ్, సమీక్షించారు. గోదావరి ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం వల్ల ములుగు, భూపాలపల్లి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ముంపు గ్రామాలను గుర్తించి.... 6వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే...

మహబూబాబాద్ జిల్లాలో వాగులు...వంకల ఉద్ధృతి తగ్గలేదు. చెరువులు అలుగులు దాటి ప్రవహిస్తున్నాయి. వర్షాల ధాటికి వేమునూరులో రెండు ఇళ్లు....బయ్యారంలో ఓ ఇళ్లు కూలీ పోయాయి. కొత్తపల్లి, బర్కపల్లె వాగులను కలెక్టర్‌ గౌతమ్ పరిశీలించారు. జనగామ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండు కుండలా మారాయి. తరిగొప్పుల మండలంలోని పోతారం నుంచి సూల్‌పురం వెళ్లే రహదారి దెబ్బతింది. జిల్లాలో ఏడు రహదారులు నీటి ప్రవాహానికి మునిగిపోగా.... ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు. వరంగల్‌ గ్రామీణ జిల్లాలో వర్షాల ధాటికి 36వేల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. తెరాస ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరంగల్‌లో వరదల దుస్థితి వచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. హన్మకొండలోని పలు ముంపు ప్రాంతాలను, జలమాయమైన కాలనీలను ఆయన పరిశీలించారు.

వేల ఎకరాల్లో నీట మునిగిన పంట

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా....వానలు తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహాలు కొనసాగుతునే ఉన్నాయి. కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో గోదావరి ఉద్ధృతికి ఇల్లు, పంటలు నీట మునిగాయి. మణుగూరు మండలంలోని కమలాపురం, చినరాయిగూడెం గ్రామంలో పలు ఇళ్లలోకి నీరు చేరింది. అధికారులు పడవలపై గ్రామానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. అశ్వాపురం మండలంలో నెల్లిపాక, అమెర్ధ, ఆనందపురం గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ముంపు ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. నియోజకవర్గంలో సుమారు 6 వేల ఏకరాల్లో పంట నష్టం వాటిల్లింది.

నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియాలో వర్షాల కారణంగా.... ఇల్లందు, కోయగూడెం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఖమ్మం జిల్లా కొణిజర్లలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీపీఎం జిల్లా బృందం పరిశీలించింది. నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఇల్లెందులో వర్షం కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యే హరిప్రియ పర్యటించారు. కొమ్ముగూడెంలో నిరాశ్రయులుగా మారిన ఓ కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందించారు.

ఇదీ చూడండి: పురపాలక శాఖ అధికారులు బాగా పనిచేశారు: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.