ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనపై అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని స్వగృహంలో ప్రజా ప్రతినిధులు, జడ్పీ ఛైర్మన్లతో మున్సిపల్ ఎన్నికలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, పార్లమెంటు సభ్యుడు పసునూరి దయాకర్, పలువురు ఎమ్మెల్యే పాల్గొన్నారు.
వార్డుల వారీగా వందమంది కార్యకర్తల జాబితా రూపొందించాలని మంత్రి నేతలకు సూచించారు. శాసనసభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో... మున్సిపల్ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితాలు రాబట్టాలని తెలిపారు. అన్ని వర్గాలతో కలిసి పని చేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.
ఇవీ చూడండి: 'గర్భం ఇద్దరికి కాదు ఒక్కరికే.. అదీ ఆమె ప్రియుడి వల్లే'