ETV Bharat / state

'ముదిరాజులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే చేపల పంపిణీ' - CHEPA PILLALA VIDUDHALA

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం సోమిడి చెరువులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు చేపలు వదిలారు. ముదిరాజులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే చేపల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్​ ప్రారంభించారని తెలిపారు.

author img

By

Published : Oct 11, 2020, 4:05 PM IST

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి దేశవ్యాప్తంగా తెలిసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం సోమిడి చెరువులో మంత్రి చేతుల మీదుగా ఉచిత చేప పిల్లలను వదిలారు. ప్రభుత్వ చీఫ్​ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్​ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబాటుకు గురైన తెలంగాణ... ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధివైపు అడుగులు వేస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఆట ప్రజలను సంఘటితం చేసిందన్నారు. బతుకమ్మ పండుగను కల్వకుంట్ల కవిత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేశారని కొనియాడారు. ముదిరాజులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్​... చెరువుల్లో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రం నుంచి దేశవిదేశాలకు చేపలను ఎగుమతి చేసే స్థాయికి మత్స్యకారులు ఎదగాలని తెలిపారు.

ఇదీ చూడండి: వాయుగుండంగా అల్పపీడనం.. మరో మూడురోజుల పాటు వర్షాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.