వ్యవసాయంలో ఉన్న సంతోషం ఎందులోనూ ఉండదని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు సతీమణి ఉషాదయాకర్ పేర్కొన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని వారి వ్యవసాయ క్షేత్రంలో కూలీలతో కలిసి పత్తి విత్తనాలు విత్తారు. ఇలా వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో అందాన్ని ఇస్తుందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.
సమయం దొరికినప్పుడల్లా ఇలా వ్యవసాయ పనులు చేస్తానని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. కేసీఆర్ సూచించిన పంటలనే రైతులు వేస్తున్నారని, తద్వారా వారికి లాభసాటిగా ఉంటుందని ఆమె తెలిపారు.
ఇదీ చదవండి: ఈపీఎఫ్‌ఓ కొత్త విధానం.. ఎక్కడి నుంచైనా అభ్యర్థనల పరిశీలన