వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మికంగా సందర్శించారు. పీపీఈ కిట్ వేసుకుని కొవిడ్ వార్డును పరిశీలించి బాధితులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఎంజీఎంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్న మంత్రి.. ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు సరిపడా ఉన్నాయని.. 800 పడకలు అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. ఎంజీఎంను పూర్తిస్థాయి కొవిడ్ వైద్య సేవలకు వినియోగిస్తామని తెలిపారు. పరిస్థితి విషమించే వరకు చూడటం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఆసుపత్రిలో 650 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయని, ప్రస్తుతం 400 పెషెంట్లు మాత్రమే ఉన్నారని అన్నారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత గురించి మంత్రి ఈటలతో మాట్లడినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి : వీధి కుక్కలు దాడి.. 25 మూగ జీవాలు మృతి