ETV Bharat / state

'ఎంఐఎంతో పొత్తు లేకుండానే మేయర్​ పీఠం కైవసం చేసుకుంటాం'

author img

By

Published : Dec 5, 2020, 2:56 PM IST

ఎంఐఎంతో పొత్తు లేకుండానే గ్రేటర్​లో మేయర్​ పీఠం దక్కించుకుంటామని పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు స్పష్టం చేశారు. మత ఘర్షణలు రెచ్చగొట్టి భాజపా, ఎంఐఎంలు ఎన్నికల్లో లబ్ధిపొందాయని ఆయన ఆరోపించారు. వరంగల్​ మహానగరపాలక సంస్థ కొనుగోలు చేసిన ట్రాక్టర్లను,​ కంప్రెషర్లను ఆయన ప్రారంభించారు.

minister errabelli started new vehicles at greater  warangal  today
పొత్తు లేకుండానే మేయర్​ పీఠం కైవసం చేసుకుంటాం: ఎర్రబెల్లి

భాజపా, ఎంఐఎంలు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధిపొందాయని పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా మెజారిటీ ప్రజలు తెరాస వైపే ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఐఎం పొత్తు లేకుండానే గ్రేటర్​ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని ఆయన అన్నారు.

వరంగల్​ మహానగర పాలకసంస్థ రూ.30 కోట్లతో కొనుగోలు చేసినా ట్రాక్టర్లను,కంప్రెషర్లను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, పురపాలక కమిషనర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:యాదాద్రిలో శాశ్వత పూజల పునరుద్ధరణకు హిందూ పరిరక్షణ సమితి డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.