మంత్రి ఈటలతో కలిసి కేటీఆర్ రేపు వరంగల్ రానున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. వరద నష్టంపై పరిశీలన జరపనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదల కారణంగా ప్రజల ఇబ్బందులు, దెబ్బతిన్న రహదారులు, పంట నష్టం తదితర అంశాలపై ఆర్అండ్బీ అతిథి గృహంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి సత్యవతి రాఠోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, మేయర్ గుండా ప్రకాశ్‌రావు సమావేశంలో పాల్గొన్నారు.
వరదల కారణంగా నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. నగరవాసులకు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.